Saturday, January 18, 2025
HomeTrending NewsBRS vs BJP: బిజెపి ఓట్లు దండుకునే ప్రయత్నం - ఎమ్మెల్సీ కవిత

BRS vs BJP: బిజెపి ఓట్లు దండుకునే ప్రయత్నం – ఎమ్మెల్సీ కవిత

విభజించు పాలించు ఉన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తూ భారతీయ జనతా పార్టీ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బ్రిటిష్ వారు మొదలుపెట్టిన విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు బిజెపి పాటిస్తోందని ధ్వజమెత్తారు. మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు. మణిపూర్ లో ప్రభుత్వ ప్రాయోజిత హింస జరుగుతుందని ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత , వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్‌ చాంబర్‌లో ఫొటో దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మండలి పనితీరు తెలుసుకోవడంతో ప్రజాసేవపై ఆసక్తి పెరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

శనివారం శాసన మండలిలో గిరిజనుల స్థితిగతులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొని కవిత మాట్లాడారు.

మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలపై కల్వంకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనలను ఈ దేశ గిరిజనులపై ప్రభుత్వ ప్రయోజిత హింసగా అభివర్ణించారు. రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి మొత్తం యంత్రాంగం నిలబడి చూసుకుంటూ ఉన్న పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని, దీన్ని అందరూ ఖండించాలని స్పష్టం చేశారు. అన్ని జాతులు బాగుపడాలని మనం కోరుకుంటుంటే…. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలో కనిపిస్తోందని స్పష్టం చేశారు.

గిరిజనులకు కేటాయించిన నిధులను 100 శాతం వినియోగించేలా ప్రభుత్వం వ్యవస్థను రూపొందిస్తోందని తెలిపారు. తెలంగాణలో ఎస్టీ జనాభా 9.5 శాతానికి పెరిగిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి ప్రభుత్వం కేంద్రానికి పంపించిందని చెప్పారు. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కల్పించిన హక్కులను గత ప్రభుత్వాల కాలరాస్తూ వచ్చాయని, అడవుల్లో పరిశ్రమలను ప్రోత్సహించాయని విమర్శించారు. భూములపై హక్కులు ఇవ్వాలంటూ అనేక మంది దరఖాస్తు చేశారని, వాటిని పరిశీలించిన తర్వాత లక్షా 50 వేల మంది గిరిజనులను 4 లక్షల 5 వేల ఎకరాలకు కేసీఆర్ సర్కార్ పట్టాలు ఇచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు సెటిల్ చేసిన అటవీ విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని ప్రకటించారు. రాష్ట్ర అడవుల్లో 10.6 శాతం మేర విస్తీర్ణాన్ని గిరిజనులకు ఇచ్చామని తెలిపారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజన హక్కులను హరిస్తోందని విమర్శించారు. గ్రామ సభలు తీర్మానం చేసే హక్కును కూడా తొలగిస్తూ చట్ట సవరణ చేసే ప్రయత్నం చేశారన్నారు. అటవీ హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేశారని, పెసా చట్టాన్ని చాలా పేవలంగా అమలు చేస్తున్నారని కాగ్ కూడా తేల్చిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. గిరిజన సబ్ ప్లాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, పదేపదే కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్