Sunday, January 19, 2025
Homeసినిమాఆలోచింపజేసే కథ .. 'కాల్వన్' 

ఆలోచింపజేసే కథ .. ‘కాల్వన్’ 

తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ – ఇవాన జంటగా నటించిన ‘కాల్వన్’, ఏప్రిల్ 4వ తేదీన అక్కడి థియేటర్లకు వచ్చింది. పీవీ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భారతీరాజా ఒక కీలకమైన పాత్రను పోషించారు. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, నిన్నటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ – ఇవాన ఇద్దరూ ఇక్కడి ఆడియన్స్ కి బాగా పరిచయమే కావడం వలన, వెంటనే కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కథలోకి వెళితే .. హీరో ఒక అనాథ .. చిల్లర దొంగతనాలు చేస్తూ వెళుతుంటాడు. హీరోయిన్ పై అతనికి ఆకర్షణ ఉంటుంది. కానీ అతనిపై ఆమెకి సానుభూతి మాత్రమే ఉంటుంది. ఆమెలో మానవత్వం ఎక్కువని గ్రహించిన హీరో, ఆమె నుంచి మంచి మార్కులు కొట్టేయడం కోసం, అనాథ అయిన ఒక వృద్దుడిని దత్తత తీసుకుంటాడు. ఆ వృద్ధుడు చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుపై ఆశతోనే అతను ఆ పని చేస్తాడు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనే ఆలోచన చేస్తాడు.

అతని మొదటి ప్లాన్ వర్కౌట్ అవుతుంది .. అతని మానవత్వానికి కరిగిపోయి ఆమె అతని ప్రేమలో పడుతుంది. అయితే ఆ వృద్ధుడిని అతను ఎందుకు దత్తత తీసుకున్నాడనే విషయం ఆమెకి తెలిసిపోతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేదే కథ. ‘అబ్బాయిలు అమ్మాయి అందం చూసి ప్రేమిస్తారు .. కానీ అమ్మాయిలు అబ్బాయి అందమైన మనసును చూసి ప్రేమిస్తారు’ అనే ఒక లైన్ పై ఈ కథ నడుస్తుంది. ఎమోషన్స్ పరమైన ట్రాక్ ఓకే. కాకపోతే యూత్ ఆశించే స్థాయిలో లవ్ .. రొమాన్స్ కనిపించవంతే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్