Saturday, March 14, 2026
Homeసినిమావిశేషంగా ఆక‌ట్టుకుంటున్న‌ ‘కిన్నెర‌సాని’ ట్రైల‌ర్

విశేషంగా ఆక‌ట్టుకుంటున్న‌ ‘కిన్నెర‌సాని’ ట్రైల‌ర్

Kalyan Dev- Kinnerasani: ‘విజేత’ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ సాధించక‌పోయినా న‌టుడుగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన తాజా చిత్రం ‘కిన్నెర‌సాని’. ఈ చిత్రానికి ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని రజనీ తాలూరి, రవి చింతల సంయుక్తంగా నిర్మించారు.  క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్ర విజయ్‌ కీలకపాత్ర పోషించారు.

ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… ‘నీ ముందున్న సముద్రపు అలల్ని చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్లిపోతున్నట్టున్నాయ్‌. కానీ, సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు. నేను కూడా అంతే’ అంటూ కథానాయిక అన్‌ షీతల్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

అలానే కళ్యాణ్ దేవ్ ఏదో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో కళ్యాణ్ చాలా కొత్తగా కనిపించారు. ముఖ్యంగా కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. ఈ ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జ‌రుపుకుంటుంది. విభిన్న క‌థాంశంతో వ‌స్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : సుధీర్ బాబు సినిమాకు మైత్రీ మూవీమేకర్స్ భాగస్వామ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular