Saturday, January 18, 2025
Homeసినిమాబింబిసార 2'ను లైన్లో పెడుతున్న కల్యాణ్ రామ్!

బింబిసార 2’ను లైన్లో పెడుతున్న కల్యాణ్ రామ్!

ప్రస్తుతం కల్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లకు రానుంది. ఆ తరువాత ఆయన ‘బింబిసార 2’ను సెట్స్ పైకి తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వశిష్ఠ దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘బింబిసార’ భారీ విజయాన్ని అందుకుంది. హీరోగా – నిర్మాతగా కల్యాణ్ రామ్ కి ఈ సినిమా మంచి సంతృప్తిని ఇచ్చింది. ఈ తరహా సినిమాలను కూడా కల్యాణ్ రామ్ చేయగలడు అనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.

అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాంటి అభిమానుల ముచ్చటను తీర్చడానికి కల్యాణ్ రామ్ ఇప్పుడు రెడీ అవుతున్నట్టుగా చెబుతున్నారు. ‘బింబిసార’ సినిమా చేసిన వశిష్ఠ .. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా ఒక పాన్ ఇండియా స్దినిమా చేస్తున్నాడు. ఆ తరువాత కూడా ఆయన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలకి కథలను వినిపించినట్టు చెబుతున్నారు. అందువలన ఆయన ‘బింబిసార 2’ను చేసే అవకాశం లేదని అంటున్నారు.

ఈ కారణంగానే ‘బింబిసార 2’ కథను తన టీమ్ తో కల్యాణ్ రామ్ సిద్ధం చేయిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందనే అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో కల్యాణ్ రామ్ చేసే భారీ సినిమా ఇదే అవుతుందని అంటున్నారు. ‘బింబిసార’ మాదిరిగానే సీక్వెల్ కి కూడా భారీ బడ్జెట్ కేటాయించినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్