Saturday, March 14, 2026
Homeసినిమాసూర్యకు కమల్  గిఫ్ట్

సూర్యకు కమల్  గిఫ్ట్

Costly Gift: యూనివ‌ర్శల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విక్రమ్ సినిమా ఈనెల 3న విడుదలై ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, ఫాహిద్ ఫాజిల్ కీల‌క పాత్రలు పోషించగా సూర్య అతిథి పాత్ర పోషించారు. ఈ సినిమాకు సూర్య ఓ పెద్ద ఎసెట్ గా మారారు.

అయితే సూర్య తన దగ్గర పారితోషికం తీసుకోలేదని, ఫోన్ లో సంప్రదించగానే వెంటనే ఒప్పుకున్నారని కమల్ ఇటీవలి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించాడు.

అయితే సినిమా ఘన విజయం సాధించడంతో కమల్ స్వయంగా సూర్యను కలిసి రోలెక్స్ వాచ్ ను  బహూహరించాడు.

‘ఇలాంటి మధుర క్షణాలే జీవితాన్ని ఎంతో సంతోషంగా ఉంచుతాయి’ అంటూ సూర్య ట్విట్టర్ లో తన ఆనందం వ్యక్తం చేస్తూ కమల్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో  దిగిన ఫోటోను షేర్ చేశాడు. ‘థాంక్యు అన్నయ్య’ అంటూ కమల్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఈ ఫోటో షేర్ చేయగానే ఈ వాచ్ ఖరీదు ఎంత  ఉండొచ్చనే ప్రశ్న నెటిజన్లకు తలెత్తింది. రోలెక్స్ వాచ్ ల ధరలను సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular