Sunday, January 19, 2025
Homeసినిమానితిన్ `చిల్ మారో` పాటను లాంచ్ చేయనున్న కమల్

నితిన్ `చిల్ మారో` పాటను లాంచ్ చేయనున్న కమల్

Chill Maro: యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ ప్రస్తుతం ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో `మాచర్ల నియోజకవర్గంలో` నటిస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ `చిల్ మారో చిల్ మారో`ని విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తున్నారు. ఉలగ నాయగన్ కమల్ హాసన్ ఈ పాటను లాంచ్ చేయనున్నారు.

రేపు హైదరాబాద్‌ లో జరగనున్న కమల్ హాసన్ విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీన్ని లాంచ్ చేయనున్నారు. శ్రేష్ట్ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ చిత్రాన్ని విడుదల చేయనుంది. కార్నివాల్‌ స్టైలిష్ పోజ్ ఇచ్చిన నితిన్ పోస్టర్‌ లో చురుగ్గా మరియు ఆనందంగా కనిపిస్తున్నాడు. ఈ మాస్ మరియు యాక్షన్ ఎంటర్‌ టైనర్‌కు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

పక్కా మాస్ మరియు కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌. ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ మరియు అనల్ అరసు సినిమా యాక్షన్ పార్ట్‌ కు మాస్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా కొరియోగ్రఫీ చేసారు. మాచర్ల నియోజకవర్గం ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్