Saturday, January 18, 2025
HomeసినిమాIndian 2 Vs Pushpa 2: 'ఇండియన్ 2' కి షాక్ ఇచ్చిన 'పుష్ప 2'..?

Indian 2 Vs Pushpa 2: ‘ఇండియన్ 2’ కి షాక్ ఇచ్చిన ‘పుష్ప 2’..?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఇండియన్ 2’. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది అయితే.. కమల్ విక్రమ్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి ఫామ్ లోకి రావడంతో ఇండియన్ 2 మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. చరణ్‌ తో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ.. ఇండియన్ 2 షూటింగ్ చేస్తున్నారు.

అయితే.. ఇప్పటి వరకు ఇండియన్ 2 రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు కానీ.. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. నెక్ట్స్ ఇయర్ ఆగష్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇండియన్ 2 రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ప్లానింగ్ లో ఉంది కానీ.. పుష్ప 2 మాత్రం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది. నెక్ట్స్ ఇయర్ ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మార్చి 22న పుష్ప 2 రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఆగష్టు 15న రిలీజ్ అని అనౌన్స్ చేసి శంకర్ కి షాక్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.

ఇండియన్ 2 చిత్రాన్ని ఆగష్టు 15న అనౌన్స్ చేద్దామనుకుంటుంటే.. పుష్ప 2 ఇలా షాక్ ఇవ్వడంతో శంకర్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. పుష్ప 2 తో ఇండియన్ 2 పోటీకి సై అంటూ అదే డేట్ కి రిలీజ్ చేస్తారా..? లేక వేరే డేట్ చూసుకుంటారా..? అనేది ఆసక్తిగా మారింది. ఇండియన్ 2 నిర్మాత దిల్ రాజు కాబట్టి ఆ డేట్ కి రిలీజ్ చేయకపోవచ్చు. మరి.. ఇండియన్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్