Sunday, February 23, 2025
Homeసినిమాషూటింగ్ చివ‌రి ద‌శ‌లో కమల్ హాసన్ ‘విక్రమ్’

షూటింగ్ చివ‌రి ద‌శ‌లో కమల్ హాసన్ ‘విక్రమ్’

Kamal joined in shooting: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా ‘విక్రమ్’.  డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. నిన్నటినుంచి కమల్ హాసన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ స్టార్స్ ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరైన్, కాళిదాస్ జయరాం నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్ట్‌ లో  ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎన్నో షెడ్యూల్స్ పూర్తయ్యాయి. కమల్ హాసన్‌కు కరోనా సోకడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత కమల్ నేడు షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, ప్రముఖ తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత కెమెరామెన్ గిరీష్ గంగాధరన్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్, కొరియోగ్రఫర్ శాండీ, యాక్షన్ డైరెక్టర్ అంబరివ్‌. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్, కమల్ హాసన్ సంయుక్తంగా ‘విక్రమ్’ను నిర్మిస్తున్నారు.

Also Read : శ్యామ్ సింగ రాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ : నాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్