Thursday, March 19, 2026
HomeTrending Newsకమల్ హాసన్ కు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక..

కమల్ హాసన్ కు అస్వస్థత – ఆస్పత్రిలో చేరిక..

సుప్రసిద్ధ సినీ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   నిన్నటి నుండి తీవ్ర జ్వరంతో పాటు శ్వాసకు సంబంధించిన సమస్యలతో అయన బాధపడుతున్నారు.  దీనితో  నిన్న అర్ధరాత్రి హుటాహుటిన ఆయనను పేరూరు రామచంద్ర ఆసుపత్రికి తరలించారు.

పోస్ట్ కోవిడ్ లక్షణాలతో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం . కమల్ హాసన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

కళా తపస్వి, దర్శకుడి కే విశ్వనాథ్ ను నిన్న ఉదయం కమల్ కలుసుకున్నారు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతలోనే కమల్ అనారోగ్యం వార్వాత సంచలనం  కలిగిస్తోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular