విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ గురునానక్ కాలనీలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సహకారంతో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన అభిమాన సంఘాలు ఏర్పాటు చేశాయి. పద్మ విభూషణ్, విలక్షణ నటుడు కమలహాసన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, కేవలం పది రోజుల వ్యవధిలోనే విగ్రహ ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారని దేవినేని అవినాష్ వెల్లడించారు.
తన తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్, దేవినేని అవినాష్ లకు హీరో మహేష్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాగా, భారతీయుడు-2 షూటింగ్ లో పాల్గొనేందుకు కమల్ హాసన్ విజయవాడ వచ్చారు. రెండ్రోజులపాటు నగరంలో వివిధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.