Saturday, January 18, 2025
Homeసినిమాఅద్భుతమైన విజువల్స్ తో అంచనాలు పెంచుతున్న 'కంగువా'

అద్భుతమైన విజువల్స్ తో అంచనాలు పెంచుతున్న ‘కంగువా’

ఒకప్పటిలా ఇప్పుడు రొటీన్ కథలను తెరపై చూపిస్తే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఆడియన్స్ కి హాలీవుడ్ సినిమాల జాబితా అరచేతిలో ఉంటుంది. అందువలన ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించాలంటే కొత్తగా ఏదైనా చేయాలి. లేదంటే థియేటర్స్ దగ్గర సినిమాలు నిలబడే పరిస్థితి లేదు. అందువలన సీనియర్ స్టార్ లు సైతం కొత్త కాన్సెప్ట్ లపై .. కొత్త ప్రయోగాలపై దృష్టిపెడుతున్నారు. అలా సూర్య చేసిన మరో ప్రయాగమే ‘కంగువా’

శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వదిలిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి మొదలైంది. అందుకు కారణం సూర్య లుక్ .. కథా నేపథ్యం. అప్పటి నుంచి వదులుతున్న ప్రతి అప్ డేట్ ఈ సినిమాపై అందరిలో ఉత్కంఠను పెంచుతూనే వెళ్లింది. రీసెంటుగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కూడా ‘ఔరా’ అనిపించింది. ఈ సినిమా తప్పకుండా చూడాలనే ఒక కుతూహలాన్ని రేకెత్తించింది.

సూర్య లుక్ .. కాస్ట్యూమ్స్ .. పోరాట దృశ్యాలు .. ఫొటోగ్రఫీ  .. అద్భుతమైన విజువల్స్ ..  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడం ఖాయమనే ఒక నమ్మకం చాలామందిలో బలపడింది. సూర్య కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలబడం ఖాయమనే అనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, దిశా పటాని కథానాయికగా అలరించనుండగా, ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించనున్నాడు. 38 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్