Sunday, January 19, 2025
Homeసినిమాప్యాన్ ఇండియా మూవీ ప్రారంభించిన కన్నడ దర్శకుడు ప్రేమ్

ప్యాన్ ఇండియా మూవీ ప్రారంభించిన కన్నడ దర్శకుడు ప్రేమ్

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘జోగి’, ‘రాజ్ ద షో మ్యాన్’, ‘ద విలన్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ప్రేమ్. దర్శకుడిగానే కాక గాయకుడిగా, గీత రచయితగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా శాండల్ వుడ్ లో పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ‘పీ9’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. విభిన్న కథలతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు ప్రేమ్, ప్యాన్ ఇండియా సినిమా పీ9 రూపొందిస్తుండటం చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది.

ఈ క్రియేటివ్ డైరెక్టర్ కెరీర్ లో పీ9 మరో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల వీడియోతో పాటు స్నీక్ పీక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఛక్రదారి అయిన శ్రీకృష్ణుడు…యుద్ధానికి సన్నద్ధమవుతూ భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని పేర్కొన్నారు. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమా పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇది మైథాలజీ కాన్సెప్ట్ మూవీనా.? ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారు? ఎవరు నిర్మించనున్నారు? అనే విషయాలను త్వరలో వెల్లడించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్