Thursday, March 12, 2026
Homeసినిమా'కన్నప్ప' పై అంచనాలు పెంచనున్న టీజర్!

‘కన్నప్ప’ పై అంచనాలు పెంచనున్న టీజర్!

‘కన్నప్ప’ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా కాలం పట్టింది. అసలు ఈ ప్రాజెక్టు మొదలవుతుందా లేదా అనే సందేహం కూడా వచ్చింది. అలాంటి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లిన తరువాత చకచకా తన పనులను పూర్తిచేస్తూ వెళుతోంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలావరకూ న్యూజిలాండ్ లో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ కూడా పాల్గొంటూ ఉండటం విశేషం.

ఈ సినిమాలో ప్రభాస్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన శివుడిలా కనిపిస్తాడని, లేదు నందీశ్వరుడి పాత్రను పోషిస్తున్నాడనీ .. కాదు ఒక అవధూతగా ఆయన పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ తన ఇష్టమైన పాత్రనే ఎంచుకుని చేస్తున్నాడని మంచు విష్ణు చెప్పాడు. దాంతో అసలు ఈ సినిమాలో ప్రభాస్ పోషించే పాత్ర ఏమిటనేది ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే టీజర్ ను వదలడానికి టీమ్ రెడీ అవుతోంది.

‘కన్నప్ప’ సినిమాకి సంబంధించిన టీజర్ ను ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ టీజర్ ను వదలనున్నారు. టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎంపిక చేయబడిన తారాగణం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోహన్ బాబు .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. అక్షయ్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular