Sunday, January 19, 2025
Homeసినిమాఓటీటీలో దూసుకుపోతున్న 'కన్నూర్ స్క్వాడ్'

ఓటీటీలో దూసుకుపోతున్న ‘కన్నూర్ స్క్వాడ్’

మలయాళంలో తిరుగులేని స్టార్ గా మమ్ముట్టి హవా కొనసాగుతూనే ఉంది. తన కెరియర్ లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా చాలాసార్లు తెరపై కనిపించారు. ఆయన పోలీస్ ఆఫీసర్ గా .. సీబీఐ ఆఫీసర్ గా చేసిన చాలా సినిమాలు సక్సెస్ కావడం విశేషం. అయితే ఈసారి ఆయన అందుకు కాస్త భిన్నంగా పోలీస్ స్క్వాడ్ కి చెందిన బాస్ గా నటించాడు. అలా ఆయనను చూపించిన సినిమానే ‘కన్నూర్ స్క్వాడ్’. రెండు నెలల క్రితం మలయాళంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడ హిట్ కొట్టింది.

ఆ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. అందుకు కారణం ఈ సినిమా కంటెంట్ .. మమ్ముట్టి యాక్షన్ అనే చెప్పాలి. కథలో .. ఒక రాజకీయనాయకుడి హత్య జరుగుతుంది. ఆ హత్య కేసు ‘కన్నూర్ స్క్వాడ్’ కి అప్పగించబడుతుంది. ఆ కేసును ఛేదించడానికి ఈ స్క్వాడ్ కి 10 రోజుల మాత్రమే గడువు ఇస్తారు. ఆ గడువులోగా హంతకులను ఈ స్క్వాడ్ ఎలా పట్టుకుందనేదే కథ.

ఈ కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ చాలా ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. పోలీస్ డిపార్టుమెంటుపై రాజకీయనాయకుల ఒత్తిడి ఎలా ఉంటుంది? పై అధికారుల నుంచి పోలీస్ వారికి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగిన పోలీస్ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి? అనేది దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం ఆడియన్స్ ను మెప్పిస్తుంది. క్రైమ్ నేపథ్యాన్ని కలిగిన పోలీస్ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్