యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్నసినిమా కార్తికేయ 2. శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా ఈ సినిమా రూపొందిందని… టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా పై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా కార్తికేయ 2 చిత్ర యూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ గారి నుంచి ఆహ్వానం లభించింది. ఇస్కాన్ దేవాలయాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. దేశ దేశాల్లో.. ఖండఖండాంతరాలుగా వ్యాపించి ఉన్నాయి. ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలుపెట్టి ఎన్నో వందల దేశాల్లో ఇస్కాన్ టెంపుల్స్ కొలువై ఉన్నాయి. అంతటి ప్రగ్యాతి గాంచిన ట్రస్ట్ నుంచి కార్తికేయ 2 టీమ్‌కు ఆహ్వానం లభించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఇప్పటివరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి.
భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించింది. బృందావన్‌కు ఆహ్వానం అనేది చిన్న విషయం కాదు. శ్రీ కృష్ణుడి తత్వం, ఫిలాసఫీ, ఆయన ప్రభావం భరతఖండంపై ఎలా ఉంది..ఆయన బోధించిన సారాంశం ఏంటి అనేది కోర్ పాయింట్‌గా కార్తికేయ 2 సినిమా ఉండబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
Also Read : ఆసక్తికరంగా ‘కార్తికేయ 2’ ట్రైలర్