Sunday, March 15, 2026
HomeసినిమాKarthikeya: వచ్చేనెలలో 'బెదురులంక 2012' విడుదల

Karthikeya: వచ్చేనెలలో ‘బెదురులంక 2012’ విడుదల

కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి కలిసి నటించిన చిత్రం ‘బెదురులంక 2012’.  భారీ అంచనాల మధ్య జూన్ లో ప్రపంచ వ్యాప్త విడుదలకి సిద్ధంగా ఉంది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై ప్రొడక్షన్ నంబర్ 3గా  రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించగా సి. యువరాజ్ సమర్పిస్తున్నారు.  క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్ర కథ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం, కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్, గోదావరి తీర ప్రాంతం, ఆద్యంతం నవ్వించే కామెడీ, ఇలా ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో టీజర్ లో ఇది వరకే చూపించేసారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్రం పై పూర్తి నమ్మకంతో ప్రపంచ వ్యాప్త విడుదల చేస్తున్నాం. ఇది ‘ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్’ అవుతుంది. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే ‘బెదురులంక 2012’ ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అన్నారు. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular