Saturday, January 18, 2025
Homeసినిమాఒక్క హిట్టు కోసమే కార్తికేయ వెయిటింగ్! 

ఒక్క హిట్టు కోసమే కార్తికేయ వెయిటింగ్! 

కార్తికేయ .. మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీ ఉన్న హీరో. యాక్షన్ సినిమాలకు సరిగ్గా సరిపోయే కటౌట్. ‘RX 100’ సినిమాతో ఒక్కసారిగా యూత్ ను టచ్ చేసిన హీరో. యాక్షన్ తో పాటు రొమాంటిక్ హీరోగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి కార్తికేయ, ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస ప్రాజెక్టులు చేస్తూ వెళ్లాడు. అయితే ఆ స్థాయి హిట్ మాత్రం అతనికి దొరక్కుండా తప్పించుకుంటూనే ఉంది.

సరైన కథలను ఎంపిక చేసుకోకపోవడమే తన సినిమాలు నిలబడకపోవడానికి కారణమని భావించిన కార్తికేయ, కొంత గ్యాప్ ఇచ్చి మరీ సినిమాలు చేశాడు. అయినా ఆ సినిమాల నుంచి కూడా నిరాశపరిచే ఫలితాలే వచ్చాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ‘భజే వాయు వేగం’ సినిమా చేశాడు. అజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రథన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపైనే కార్తికేయ ఆశలు పెట్టుకున్నాడు.

‘భజే వాయు వేగం’ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ అని కార్తికేయ భావిస్తున్నాడు. తన సినిమాలలో ఏయే అంశాలు ఉండలని ప్రేక్షకులు కోరుకుంటారో, ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెబుతున్నాడు. ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ను పంచుతుందని అంటున్నాడు. మొత్తానికి తాను ఎదురుచూస్తున్న హిట్ ఈ సినిమా ఇస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ఆయన జోడీగా ఐశ్వర్య మీనన్ అలరించనున్న ఈ సినిమా, ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్