Wednesday, November 27, 2024
Homeసినిమా'రాజా విక్రమార్క'తో హిట్ కొడతా : హీరో కార్తికేయ

‘రాజా విక్రమార్క’తో హిట్ కొడతా : హీరో కార్తికేయ

కార్తికేయ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా సినిమా ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి టి. సమర్పణలో రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ “వరుణ్  తేజ్ గారు మా ‘రాజా విక్రమార్క’ టీజర్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి టైటిల్ తో సినిమా చేశాం. నాకు మెగాస్టార్ అంటే ఎంత ఇష్టమనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన టైటిల్ పెట్టుకునే అదృష్టం ఈ సినిమా ద్వారా నాకు దొరకడం చాలా చాలా సంతోషంగా ఉంది”

“ఈ సినిమా టీజర్ మెగా హీరో వరుణ్ తేజ్ విడుదల చేయడం… అంతా కో-ఇన్సిడెన్స్. అలా మాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ‘ఆర్ఎక్స్-100’ ట్రైలర్ ఇదే రామానాయుడు స్టూడియోలో విడుదల చేశాం. ఆ తర్వాత అందరూ వచ్చి నాతో మాట్లాడారు. అప్పుడు ఎటువంటి ఫీలింగ్, ఎమోషన్స్ ఉన్నాయో… ఇప్పుడు అదే ఫీలింగ్.  ‘ఆర్ఎక్స్-100’ టీజర్, ఈ సినిమా టీజర్ ను కంపేర్ చేయడం లేదు.. అప్పుడు… ఇప్పుడు… నా ఎమోషన్ సేమ్ అని చెబుతున్నాను. ‘రాజా విక్రమార్క’ షూటింగ్ ఫినిష్ చేసుకుని, డబ్బింగ్ చెబుతూ… టీజర్ విడుదల చేసి, అందరి ముందుకు వచ్చినందుకు గర్వంగా ఉంది”

‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత తొలినాళ్లలో ఒప్పుకొన్న కథ ఇది. అప్పటికి నాకు కథలు వినడం కూడా సరిగా రాదు. ఇన్నోసెంట్ మైండ్ తో విన్నాను. వెంటనే నచ్చింది. దర్శకుడు భలే చెప్పాడని అనుకున్నాను. అక్కడ నుండి సినిమాతో మూడేళ్ళు ప్రయాణం చేశాం. సినిమా కథను పక్కన పెడితే… సినిమా చేయడానికి జరిగిన కథను ఒక బయోపిక్ చేయవచ్చు. అంత ప్రాసెస్ జరిగింది. మొదట ఈ సినిమాను మేమే నిర్మించాలని అనుకున్నాం. వేరే సినిమా తీయడం వల్ల దీన్ని వెనక్కి షిఫ్ట్ చేశాం. తర్వాత వేరే కారణాల వల్ల వెంటనే ‘రాజా విక్రమార్క’ స్టార్ట్ చేయలేకపోయాం. అప్పుడు ’88’ రామారెడ్డి గారు, ఆదిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళిద్దరికీ థాంక్స్”

“వాళ్ళకు సినిమాల్లో పెద్దగా అనుభవం లేదు. నేను కూడా ఒకట్రెండు సినిమాలు చేశా. కొత్త దర్శకుడిని నమ్మి సినిమా మొదలుపెట్టారు. కొంత షూటింగ్ చేసిన తర్వాత వేరే సినిమా చేసినా… మధ్యలో కరోనా వచ్చినా… ఇబ్బందులు ఎన్ని ఎదురైనా మాకు సపోర్ట్ చేశారు. మా దర్శకుడు శ్రీ సరిపల్లి కూడా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. నాకు ధైర్యం చెప్పేవాడు. సాయికుమార్ గారు, తనికెళ్ల భరణి గారు, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. చందు సినిమాటోగ్రఫీ సూపర్. ఇప్పటి వరకు ప్రశాంత్ ఆర్. విహారి ప్రేమకథలు చేశాడు. ఫస్ట్ టైమ్ జానర్ షిఫ్ట్ చేశాడు. అతడు ఇచ్చిన మ్యూజిక్ అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. టెక్నికల్ గానూ సినిమా హైస్టాండర్డ్స్ లో ఉంటుంది. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ బావుంది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాను. నేను బ్యాచిలర్‌గా చేసిన లాస్ట్ సినిమా ఇది. మంచి హిట్ కొట్టి జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేస్తే చాలా బావుంటుంది. తప్పకుండా హిట్ కొడతామని నాకు తెలుసు” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్