Saturday, March 14, 2026
Homeసినిమాఆక‌ట్టుకుంటున్న‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌

ఆక‌ట్టుకుంటున్న‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌

Katha-Kanchi: తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్ పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తోంది. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది.

తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరివరకు ఆహ్లాదకరంగానే సాగింది ట్రైలర్. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి.. మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియ‌చేస్తామ‌న్నారు మేక‌ర్స్.

Also Read : మెగాస్టార్ ని డైరెక్ట్ చేయ‌నున్న సుకుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular