Sunday, March 8, 2026
HomeTrending Newsస్వలాభం కోసమే ఈటల రాజీనామా

స్వలాభం కోసమే ఈటల రాజీనామా

హుజూరాబాద్‌ అభివృద్ధి కోసం తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కౌశిక్‌రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం సమక్షంలో తెరాసలో చేరుతానని ప్రకటించారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కౌశిక్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ కృషితో హుజూరాబాద్‌ రైతులంతా సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం, ఎల్‌ఎండీ జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్‌ ఎన్నో పథకాలు తెచ్చారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ అభివృద్ధిని విస్మరించారు. ప్రజా సమస్యల కోసం ఈటల రాజీనామా చేయలేదు. స్వలాభం కోసమే ఈటల రాజీనామా చేశారు’’ అని కౌశిక్‌ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular