Saturday, January 18, 2025
Homeసినిమామెగా హీరో జోడీగా 'బలగం' బ్యూటీ?

మెగా హీరో జోడీగా ‘బలగం’ బ్యూటీ?

‘బలగం’ సినిమా చాలామందికి మంచిపేరు తెచ్చిపెట్టింది. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసిన కావ్య కల్యాణ్ రామ్ కి ఈ సినిమా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చింది. కథాబలం కలిగిన ఈ సినిమాలో తన పాత్రవైపు నుంచి తనకి కావలసిన మార్కులు రాబట్టుకోవడంలో ఆమె సక్సెస్ అయింది. అప్పటి నుంచి ఆమెకి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

గ్లామర్ పరంగా .. నటన పరంగా కావ్యకి వంక బెట్టవలసిన పనిలేదు. అయితే నెక్స్ట్ లెవెల్ హీరోల సరసన అవకాశాలను అందువులేకపోతోందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె సాయిధరమ్ తేజ్ జోడీగా ఆమె ఛాన్స్ కొట్టేసిందనేది తాజా సమాచారం. తన కెరియర్ లో హీరోయిన్ గా ఆమె చేసే పెద్ద సినిమా .. పెద్ద హీరో సినిమా ఇదేనని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీలో బలంగా వినిస్తోంది. అయితే ఫస్టు హీరోయిన్ గా చేస్తుందా? సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందా? అనేది తెలియాల్సి ఉంది.

‘హను మాన్’ వంటి భారీ విజయాన్ని అందించిన నిరంజన్ రెడ్డి, ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో రోహిత్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘విరూపాక్ష’ హిట్ తరువాత సాయిధరమ్ తేజ్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం ‘సంబరాల ఏటి గట్టు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. షూటింగు మొదటి రోజునే టైటిల్ పోస్టర్ ను వదిలే ఆలోచనలో ఉన్నారు. కావ్య కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్