Sunday, January 19, 2025
Homeసినిమాస్పీడ్ పెంచుతున్న కావ్య కల్యాణ్ రామ్!

స్పీడ్ పెంచుతున్న కావ్య కల్యాణ్ రామ్!

తెలుగు తెరపైకి బాలనటిగా పరిచయమై .. ఆ తరువాత కథానాయికగా మారినవారి జాబితాలో కావ్య కల్యాణ్ రామ్ కూడా కనిపిస్తుంది. ‘గంగోత్రి’ .. ‘బన్నీ’ .. ‘బాలు’ .. ‘ఠాకూర్’ మొదలైన సినిమాలలో బాలనటిగా ఆమె గుర్తుండిపోయే పాత్రలను చేసింది. కథానాయికగా ‘పెళ్లి సందD’తోనే పరిచయం కావలసింది.  కానీ ఆమె రాఘవేంద్రరావును కలుసుకోవడం ఆలస్యమైపోయింది. అందువలన ఆ సినిమా చేయలేకపోయింది.

ఆ తరువాత ‘మసూద’ సినిమాలో ఆమె హీరోకి జోడీగా కనిపించింది. అయితే ఆ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోవడం వలన కావ్యను ఎవరూ పట్టించుకోలేదు .. ఆమెను గురించి యూత్ కూడా మాట్లాడుకోలేదు. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘బలగం‘ సినిమా రెడీ అవుతోంది. ఈ నెల 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆమె ప్రియదర్శి జోడీగా నటించింది.

ఇది పల్లె నేపథ్యంలో నడిచే సినిమా .. కావ్య చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన ఈ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ అయ్యేలానే అనిపిస్తోంది. ఇక ఆ తరువాత సినిమాగా ఆమె ‘ఉస్తాద్’ ను చేస్తోంది. ఈ సినిమా కూడా తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుతుందని ఆమె నమ్మకంగా చెబుతోంది. కొత్త హీరోయిన్స్ రేసులో ఈ తెలంగాణ బ్యూటీ ఎంతవరకూ పరిగెడుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్