Sunday, January 19, 2025
Homeసినిమా'ఈగల్' మూవీ కావ్య థాపర్ కి కలిసొచ్చేనా?

‘ఈగల్’ మూవీ కావ్య థాపర్ కి కలిసొచ్చేనా?

టాలీవుడ్ కి పరిచయమైన కథానాయికలలో కొంతమంది ఫస్టు మూవీతోనే హిట్ కొట్టారు. మరికొంతమంది ఒకటి రెండు సినిమాల తరువాత సక్సెస్ ను అందుకున్నారు. మరికొంతమంది సరైన బ్రేక్ కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలా గట్టి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్స్ జాబితాలో కావ్య థాపర్ ఒకరుగా కనిపిస్తుంది. కావ్యథాఫర్ పేరు ‘ఏక్ మినీ కథ’ సినిమా సమయంలో వినిపించింది. కానీ అంతకుముందే ఆమె ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది.

అయితే ఆ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ కాలేదు. తెలుగులో ఆమె యూత్ దృష్టిలో పడిందీ .. సక్సెస్ ను అందుకుంది ‘ఏక్ మినీ కథ’లోనే. అందంగా .. బొద్దుగా కనిపించే కావ్యథాపర్ చాలామంది కుర్రాళ్లు అభిమానులుగా మారిపోయారు. ఆ తరువాత ఆమె చేసిన ‘బిచ్చగాడు 2’ సినిమా ఆమెకి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ లోగా హిందీలో ఆమె చేసిన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ ఆమెను మిగతా భాషల ప్రేక్షకులకు కూడా మరింత చేరువ చేసింది.

అలా కెరియర్ పరంగా కుదురుకుంటున్న కావ్య థాపర్, తెలుగులో రవితేజ సరసన నాయికగా ఒక సినిమా చేసింది .. ఆ సినిమా పేరే ‘ఈగల్’. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా, ఈ సంక్రాంతి రోజుల్లోనే రిలీజ్ కావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసుకుంది. ఈ సినిమాతో ఇక్కడ తన గ్రాఫ్ పెరుగుతుందనే నమ్మకంతో కావ్యథాఫర్ ఉంది. అలాగే జరుగుతుందేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్