Saturday, November 23, 2024
HomeTrending Newsనా కూతురినే పార్టీ మారమన్నారు - కెసిఆర్

నా కూతురినే పార్టీ మారమన్నారు – కెసిఆర్

బిజెపి మీద సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురినే పార్టీ మారమని అడిగారని.. ఇంతకంటే ఘోరం ఉంటుందా అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా అని  సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ ప్రగతి భవన్ లో మంగళవారం నిర్వహించిన పార్టీ నేతల కీలక సమావేశంలో ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈడీ దాడులు చేస్తే తిరగబడండి అన్నారు. ఎన్నికలకు పది నెలల సమయమే ఉందన్నారు. బీజేపీ పోరాడాల్సిందేనని ఎమ్మెల్యేలకు సూచించారు. పాతవాళ్లకు టికెట్లు కేటాయిస్తామన్నారు. ఎవరినీ మార్చే ప్రసక్తే లేదన్నారు.

కెసిఆర్ బీజేపీపై ఎదురుదాడికే సై అంటున్నారు.. కేంద్ర సంస్థల దాడులను ప్రతిఘటిద్దాం అని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంపై బీజేపీ కుయుక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సుదీర్ఘంగా సాగిన టీఆర్ఎస్‌ ఎల్పీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పోరాటం చేయాల్సిందే అని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈడీ దాడులకు పాల్పడితే ఎక్కడ సోదాలు నిర్వహిస్తే అక్కడే ధర్నాలు చేయాలని తిరగబడాలని సూచించారు.

బీజేపీతో పోరాడాల్సిందే అని స్పష్టం చేశారు. ఫామ్‌ హౌజ్‌ ఎమ్మెల్యేలతో సమావేశానికి వచ్చిన సీఎం కేసీఆర్ ఇక నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇతర నాయకులపై నిఘా ఉంటుందని తేల్చిచెప్పారు. ఫోన్‌లో ఏది మాట్లాడినా తెలుస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో చర్చించిన కీలక వివరాలు ఎక్కడా లీక్ కావొద్దని హెచ్చరించారు. మరోవైపు వచ్చే 10 నెలలు చాలా కీలకం అని సీఎం కేసీఆర్ క్యాడర్‌కు సూచించారు.  మంత్రులంతా జిల్లా కేంద్రాల్లోనే ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. సిట్టింగులకే మళ్లీ సీట్లిద్దామని సంకేతాలిచ్చారు. అలాగే ధరణీ సమస్యల కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని పోడు భూముల సమస్యను పరిష్కరిద్దామని తేల్చిచెప్పారు.

Also Read : తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం : సీఎం కేసీఆర్‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్