District Presidents: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సిఎం కెసియార్ జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. మొత్తం 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మెజార్టీ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అప్పగించారు. మూడు జిల్లాలకు అధ్యక్షులుగా ఎంపీలను కూడా కేసియార్ నియమించారు.
మొత్తం 33 జిల్లాల్లో 19 జిల్లాలకు ఎమ్మెల్యేలు, రెండు జిల్లాలకు ఎమ్మెల్సీలు, మూడు జిల్లాలకు ఎంపీలు, మూడు జిల్లాలకు జడ్పీ ఛైర్మన్ లను అధ్యక్షులుగా నియమించడం గమనార్హం, మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, విపక్షాలు ముఖ్యంగా బిజెపి ఇటీవలి కాలంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో జిల్లా స్థాయిలో పార్టీ యంత్రంగాన్ని సమర్ధంగా నడిపేందుకు ఎమ్మెల్యేలనే స్వయంగా కెసిఆర్ రంగంలోకి దించారు. వారికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్నిమరింత క్రియాశీలకం చేయాలని భావిస్తున్నారు.
టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుల వివరాలు….
- ఆదిలాబాద్- జోగు రామన్న (ఎమ్మెల్యే)
- కొమురం భీం ఆసిఫాబాద్ – కోనేరు కోనప్ప (ఎమ్మెల్యే)
- మంచిర్యాల – బాల్క సుమన్ (ఎమ్మెల్యే)
- నిర్మల్ – జి. విఠల్ రెడ్డి (ఎమ్మెల్యే)
- నిజామాబాద్ – ఏ. జీవన్ రెడ్డి (ఎమ్మెల్యే)
- కామారెడ్డి – ఎంకే ముజీబుద్దీన్ (మాజీ డిసిఎంఎస్ చైర్మన్)
- కరీంనగర్ – జి.వి. రామకృష్ణా రావు (చైర్మన్ – సుడా)
- రాజన్న సిరిసిల్ల – తోట ఆగయ్య (మాజీ ఎంపీపీ)
- జగిత్యాల్ – కె. విద్యాసాగర్ రావు (ఎమ్మెల్యే)
- పెద్దపల్లి – కోరుకంటి చందర్ (ఎమ్మెల్యే)
- మెదక్ – ఏం. పద్మా దేవేందర్ రెడ్డి ( ఎమ్మెల్యే)
- సంగారెడ్డి – చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
- సిద్దిపేట – కొత్త ప్రభాకర్ రెడ్డి (ఎంపీ)
- వరంగల్ – ఆరూరి రమేష్ (ఎమ్మెల్యే)
- హన్మకొండ – దాస్యం వినయ్ భాస్కర్ (ఎమ్మెల్యే)
- జనగాం – పి. సంపత్ రెడ్డి (జడ్పీ ఛైర్మన్)
- మహబూబాబాద్ – మాలోతు కవిత (ఎంపీ)
- ములుగు – కుసుమ జగదీశ్ (జడ్పీ ఛైర్మన్)
- జయశంకర్ భూపాలపల్లి – గండ్ర జ్యోతి (జడ్పీ చైర్మన్)
- ఖమ్మం – తాతా మధుసూదన్ (ఎమ్మెల్సీ)
- భద్రాద్రి కొత్తగూడెం – రేగా కాంతారావు (ఎమ్మెల్యే)
- నల్గొండ – రమావత్ రవీంద్రకుమార్ (ఎమ్మెల్యే)
- సూర్యాపేట – బడుగుల లింగయ్య యాదవ్ (ఎంపీ)
- యాదాద్రి భువనగిరి – కంచర్ల రామకృష్ణా రెడ్డి (చైర్మన్, ఆయిల్ ఫెడ్)
- రంగారెడ్డి – మంచిరెడ్డి కిషన్ రెడ్డి (ఎమ్మెల్యే)
- వికారాబాద్ – మెతుకు ఆనంద్ (ఎమ్మెల్యే)
- మేడ్చల్ – శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ)
- మహబూబ్ నగర్ – సి. లక్ష్మా రెడ్డి (ఎమ్మెల్యే)
- నాగర్ కర్నూల్ – గువ్వల బాలరాజు (ఎమ్మెల్యే)
- జోగులాంబ గద్వాల్ – బి. కృష్ణమోహన్ రెడ్డి (ఎమ్మెల్యే)
- నారాయణ్ పేట్ – ఎస్. రాజేందర్ రెడ్డి (ఎమ్మెల్యే)
- వనపర్తి – ఏర్పుల గట్టు యాదవ్ ( మున్సిపల్ చైర్మన్)
- హైదరాబాద్ – మాగంటి గోపీనాథ్ (ఎమ్మెల్యే)