Saturday, January 18, 2025
Homeతెలంగాణవైద్య సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలి: కెసియార్

వైద్య సిబ్బంది పని ఒత్తిడి తగ్గించాలి: కెసియార్

కోవిడ్ పోరులో అలుపెరగక పని చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పై పనిఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కెసియార్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్నవారిలో అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని, రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని అధికారులకు సూచించారు. వారికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు ఇవ్వాలని, కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్ ను అధికారులు రూపొందించారు. https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx

కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తో కెసియార్ ఫోన్లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను వివరించారు. కరోనా వ్యాప్తి ని పెంచే అవకాశం వున్న ‘అతివేగంగా వ్యాప్తి కారకులను’ గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని కేంద్ర మంత్రికి సూచన చేశారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు గ్యాస్ బాయ్స్, స్ట్రీట్ వెండార్స్, వేర్వేరు ప్రదేశాల్లో పనిచేసే కార్మికులను ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి వాక్సిన్ ను వెంటనే అందించేందుకు నిబంధనలను సడలించాలని కేంద్ర మంత్రిని కెసియార్ కోరారు.

కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎం జి ఎం కు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్ జిల్లా రిమ్స్’ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని సిఎం ఆదేశించారు.

వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి  తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రభుత్వ దవాఖాన్లలలో మెత్తం 7393 బెడ్లు అందుబాటులో వున్నాయని అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. 2470 ఆక్సీజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్దంగా వున్నాయని సిఎం కు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్