Saturday, March 14, 2026
HomeTrending Newsదేశాన్ని న్యాయ వ్యవస్థనే కాపాడాలి - కెసిఆర్

దేశాన్ని న్యాయ వ్యవస్థనే కాపాడాలి – కెసిఆర్

బిజెపి పాలనలో భారతదేశం ప్రమాదపు అంచుల్లో ఉందని సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అప్రజాస్వామిక విధానాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారుతోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బిజెపి విధానాలను తప్పు పడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పట్టుబడ్డ దళారుల మాటలు భయానకంగా ఉన్నాయని సిఎం చెప్పారు. దేశంలో ప్రతిపక్ష పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని… రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వాలు కూల్చేచేస్తామని చెప్పటం దారుణమన్నారు. ఈ దేశాన్ని కాపాడాలని నేను ముకుళిత హస్తాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక విషయమై బీజేపీ దుష్ప్రచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి తప్పు బట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, పాల్వాయి గోవర్దన రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి తనను వచ్చి కలిసి నట్లు దుష్ప్రచారం చేసిందని మండి పడ్డారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజం అని వ్యాఖ్యానించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పోరాడం, ఉద్యమాలు చేసినం అని చెప్పారు.

ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అంతా సక్రమంగా ఉన్నట్లు, లేకపోతే లేదన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాము నాగార్జున సాగర్‌, హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో గెలిచాం అని గుర్తు చేశారు. దుబ్బాక, హుజూరాబాద్‌ స్థానాల్లో ఓటమి పాలయ్యాం అన్నారు. కానీ రాజకీయాల్లో సంయమనం పాటించడం అవసరం అని అన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించడం సరి కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విఫలం అయ్యారని బీజేపీ నేతలు ఆరోపించారని, ఇది అత్యంత దిగజారుడు విధానం అని పేర్కొన్నారు. ఇలా దిగజారడం సరి కాదన్నారు. ఈసీని నియమించేది కేంద్రమేనని గుర్తు చేశారు.

Also Read: ఒళ్ళు మరిచి ఓటు వేస్తే.. ఇల్లు కాలిపోతది కెసిఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular