Saturday, January 25, 2025
HomeTrending NewsRevanth Reddy: కేసీఆర్ ముసుగుతో ఈటెల రాజకీయాలు - రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్ ముసుగుతో ఈటెల రాజకీయాలు – రేవంత్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ రేవంత్​ రెడ్డి హైదరాబాద్​లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు.
మునుగోడు ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ సర్వం దారబోసినా రేవంత్‌రెడ్డిని కొనలేరంటూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

మునుగోడు ఉపఎన్నిక పరిణామాలు అందరికీ తెలుసు. మునుగోడు ఉపఎన్నికలో భారాస, భాజపా భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. మేము డబ్బు, మద్యం పంచకుండా ఓట్లు అడిగాం. అమ్మవారిని నమ్ముతాను కాబట్టే ప్రమాణం చేశాను. కేసీఆర్‌తో లాలూచీ నా రక్తంలోనే లేదు. తుదిశ్వాస విడిచే వరకు కేసీఆర్‌తో రాజీపడే ప్రసక్తే లేదు. కేసీఆర్‌, కేటీఆర్‌ అవినీతిపై పోరాటం చేసింది నేను. చర్లపల్లి జైల్లో కేసీఆర్‌ నిర్బంధిచినా భయపడలేదు. కేసీఆర్‌తో కొట్లాడుతున్న మాపై నిందలా?

కేసీఆర్‌ వద్ద డబ్బు తీసుకుంటే ఆయన కళ్లల్లో చూసి మాట్లాడేవాడినా? నా నిజాయతీని శకించడం మంచిది కాదు. నా కళ్లలో నీళ్లు రప్పించావు. కేసీఆర్ సర్వం దారబోసినా రేవంత్‌రెడ్డిని కొనలేరు. ప్రశ్నించే గొంతుపై దాడి చేస్తే కేసీఆర్‌కు మద్దతు ఇచ్చినట్టే. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడటమంటే ఇదేనా రాజేంద్ర. కేసీఆర్‌ను గద్దె దించడమే నా ఏకైక లక్ష్యం, కేసీఆర్‌ను గద్దె దించడం కోసం అన్నీ పోయినా ఫర్వాలేదు. దేవునిపై విశ్వాసం ఉంటే ఈటల మాటలు ఉపసంహరించుకోవాలి, ఈటల కేసీఆర్ ముసుగు వేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఈటల ఆరోపణ నా మనోవేదనను దెబ్బతీసేలా ఉంది. నేను అమ్ముడుపోయుంటే ప్రజల గుండెల్లో ఉండేవాడిని కాదని రేవంత్‌రెడ్డి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్