Sunday, January 19, 2025
HomeTrending NewsRation Dealers: డీలర్ల డిమాండ్లను పరిష్కరించాల్సిందే - బండి సంజయ్

Ration Dealers: డీలర్ల డిమాండ్లను పరిష్కరించాల్సిందే – బండి సంజయ్

రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.  ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటని, రేషన్ డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు. మే 22న సమ్మె నోటీస్ ఇచ్చిన తరువాత వాళ్ల సమస్యలన్నీ పరిష్కారిస్తామని, ఈ మేరకు జూన్ ఫస్ట్ న జీవోలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ ఒక్క జీవో కూడా విడుదల చేయకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంవల్లే రేషన్ డీలర్లు సమ్మె చేయాల్సి వచ్చందని హైదరాబాద్ లో ఈ రోజు మండిపడ్డారు.

బండి సంజయ్ ఆరోపణల్లో ముఖ్యాంశాలు

రేషన్ డీలర్లు కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే…. తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్ గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. అయినా ఆ సొమ్మును డీలర్లకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటూ డీలర్లకు సకాలంలో చెల్లించకపోవడం దుర్మార్గం.

వడ్ల కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం వహిస్తూ రైతులతో చెలగాటమాడుతోంది. వడ్ల కొనుగోలుకయ్యే సొమ్మునంతా కేంద్రమే చెల్లిస్తోంది. వడ్లను సేకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తోంది. అయినా నేటికీ రైతుల నుండి వడ్లను కొనుగోలు చేయకుండా కళ్లెల వద్ద పడిగాపులు కాసేలా చేస్తూ వాళ్ల ఉసురు తీస్తోంది. ఇప్పటికైనా రేషన్ డీలర్లతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలి. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ మద్దను లాక్కోవాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్