ఉత్తర తెలంగాణాకు ప్రాణ ప్రదాయిని అయిన గోదావరి సీఎం కెసిఆర్ నిర్లక్షం వల్ల దుఃఖదాయినిగా మిగిలిందని బిజెపి నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కెసిఆర్ ఫాంహౌజ్ లో కూర్చుని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని, సమీక్ష చేస్తున్నామని మభ్యపెట్టవద్దని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ లో జరిగింది. పర్యటించిన రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్టులకు, చెక్ డాం లకు బిజెపి వ్యతిరేకం కాదని, కెసిఆర్ అనాలోచిత నిర్ణయాలను మాత్రేరమే వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గత సీజన్లో పంట నష్టానికి 10 వేల రూపాయలు ఇస్తా అని ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చే ఫసల్ భీమా పధకం కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.
రెడ్ అలెర్ట్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కాదని, ప్రజలను అప్రమత్తం చేయాలని, అలా చేసి ఉంటే మోరంచపల్లి లో నలుగురు ప్రాణాలు కోల్పోయేవారు కాదన్నారు. కిషన్ రెడ్డి హెలికాప్టర్ పంపించారు తప్ప రాష్ట్ర స్పందించలేదన్నారు. రిలీఫ్ క్యాంప్ లలో కనీసం బొజనం కూడా పెట్టడం లేదని, మంత్రులు అధికారాలు లేక ఉత్త చేతులతో వస్తున్నారని ఆరోపించారు. తక్షణ అవసరాల కోసం సాయం అందించడం లేదని, వరదల మీద బీజేపీ రిపోర్ట్ తయారు చేసి రాష్ట్రానికి, కేంద్రానికి అందిస్తామని వెల్లడించారు.