Wednesday, January 22, 2025
HomeTrending NewsPonnam Comments: బిజెపికి బిఆర్ఎస్ తోక పార్టీ - పొన్నం ప్రభాకర్

Ponnam Comments: బిజెపికి బిఆర్ఎస్ తోక పార్టీ – పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్న బిజెపి, బిఆర్ఎస్…బండి సంజయ్ చేస్తున్న పలుకులు, కేసీఆర్ ఆణిముత్యాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ కు చెందిన 30 మందికి కేసీఆర్ సీట్లు ఇస్తున్నారనడానికి హేతుబద్ధత లేదని మంది పడ్డారు. నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తల సమక్షంలో పొన్నం ప్రభాకర్ కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఈ రోజు  మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ పత్రిక విలేకరుల సమావేశంలో బండి సంజయ్ తీరుపై విమర్శలు గుప్పించారు.

బిజెపి, బిఆర్ఎస్ సంబంధాలపై పొన్నం ప్రభాకర్ కామెంట్స్

బిజెపికి బిఆర్ఎస్, బిఆర్ఎస్ కు బిజెపి తోక పార్టీలలా వ్యవహరిస్తున్నాయి. బిఆర్ఎస్ వైఫల్యాలను బిజెపి ఎందుకు ప్రశ్నించడం లేదు. 2018 తర్వాత వచ్చిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఎన్నికల్లో బిజెపికి ఎన్ని ఓట్లు వచ్చాయి, కనీసం 2000 కూడా దాటలేదు, హుజురాబాద్ లో గెలుపు బిజెపిది కాదు ఈటెల రాజేందర్ ది మాత్రమే అని ఆ పార్టీ నేతలు చెప్పారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోవడంతో బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్నకు బండి సంజయ్ సుత్తి నత్తి లేకుండా సమాధానం చెప్పాలి. పార్లమెంట్ నియోజకవర్గంలో రైతాంగ సమస్యలపై, వేములవాడ దేవాలయం అభివృద్ధి కి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ గురించి ఏనాడు ప్రశ్నించని బండి సంజయ్.

బిజెపిలో జోకర్ పాత్ర పోషిస్తున్న బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్నాడు. స్థానిక శాసనసభ్యుడు మంత్రి గంగుల కమలాకర్ తో బండి సంజయ్ సంబంధాలపై, ఒకరిపై ఒకరు పోటీ చేయకూడదని అవగాహనతో ముందుకు పోతున్న విషయం గురించి జిల్లా మొత్తం కోడైకూస్తుంది. జిల్లాలో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న అవినీతిపై ఒకరినొకరు ప్రశ్నించుకోకపోవడం వాస్తవం కాదా? రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రచారం గురించి నగరంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని అడిగితే యాక్సిడెంట్లు జరుగుతాయని సమాధానం చెప్పిన అధికారులు ఇప్పుడు చౌరస్తాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ల గురించి ఏమి సమాధానం చెబుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్