Tuesday, September 24, 2024
HomeTrending Newsకుమారస్వామితో కెసిఆర్ భేటి

కుమారస్వామితో కెసిఆర్ భేటి

ముఖ్యమ్నంత్రి కెసిఆర్ కొద్దిసేపటి క్రితం బెంగళూర్ లో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటి అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానం ద్వారా బ‌య‌లుదేరి బెంగుళూరుకు చేరుకున్న సిఎం కెసిఆర్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌, ఆయ‌న కుమారుడు , ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమార‌స్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు.

దేవెగౌడ నివాసంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఎంపి సంతోష్ రావు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, హఎద్రాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.

దేశంలో వర్తమాన రాజకీయాలతో పాటు ప‌లు అంశాల‌పై వీరు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా కేంద్రం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై చ‌ర్చించినట్లు స‌మాచారం. రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుస‌రించాల్సిన వ్యూహంపై దేవెగౌడ‌తో మాట్లాడారు.

Also Read : ఢిల్లీ విద్యా విధానం భేష్ – సిఎం కెసిఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్