Saturday, January 18, 2025
Homeతెలంగాణకేసీయార్ క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్ డిమాండ్

కేసీయార్ క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్ డిమాండ్

ప్రజలకు కరోనా చికిత్స సరిగా అందించలేకపోతున్నందుకు సీఎం కేసీయార్ క్షమాపణ చెప్పాలని పిసిసి అధ్యక్షుడు, ఎంపి ఉత్తమ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.

తనకు కరోనా వస్తె 3 లక్షల ఖర్చు అయ్యిందని, తనకు జీతం వస్తుంది కాబట్టి భరించ గలిగానని, పేదలు ఇంత ఖర్చు ఎలా భరిస్తారని ఉత్తమ ఆవేదన వ్యక్తం చేశారు. తానూ ఆస్పత్రిలో బెడ్ ఎలాగోలా పొందగలిగానని, పేదలకు కనీసం బెడ్ దొరికే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. టిమ్స్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక చనిపోతే ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని నిలదీశారు. కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడం లేదని అనడం సరికాదన్నారు.

హెటిరోడ్రగ్స్ కు వందల కోట్లరూపాయలు భూములు తక్కువకు అంటగట్టారని, రేమిడేసివర్ గురించి వాళ్ళ తో ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. కేవలం వారికి లాభం కలిగే వాటిపై మాత్రమే కంపెనీలతో మాట్లాడతారు కానీ ప్రజల కోసం మాత్రం మాట్లాడలేరా అని ఉత్తమ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్