Tuesday, March 10, 2026
HomeTrending NewsYSRTP: హోంగార్డుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం - వైఎస్ షర్మిల

YSRTP: హోంగార్డుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం – వైఎస్ షర్మిల

కేసీఆర్ నియంత పాలనలో మరో నిండు ప్రాణం బలైపోయిందని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినా కేసీఆర్ కు..హోం గార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరమన్నారు. హోం గార్డ్ రవీందర్ ఆత్మహత్యకు కెసిఆర్ ప్రభుత్వ విధానాలే కారణమని వైఎస్ షర్మిల రెడ్డి ఈ రోజు హైదరాబాద్లో ఆరోపించారు. పాతబస్తీకి చెందిన హోం గార్డు రవీందర్ సకాలంలో జీతం అందక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని, రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం అని విమర్శించారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లన్నారు, హెల్త్ కార్డులన్నారు..జీతాలు పెంచుతామని ప్రగల్భాలు పలికారని వైఎస్ షర్మిల రెడ్డి ఎద్దేవా చేశారు. హోం గార్డుల జీవితాలు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారని సిఎం కెసిఆర్ పై మండిపడ్డారు. హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ చేయలేదన్నారు. సమయానికి జీతాలు రావు, కనీస గౌరవం లేదని, కెసిఆర్ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలి దొరా అని ప్రశ్నించారు.

ఇదివరకే హామీ ఇచ్చిన విధంగా 20 వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేయాలని వైఎస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి మాట నిలబెట్టుకోండని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఎం కేసీఆర్ ను వైఎస్ షర్మిల రెడ్డి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular