Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్రం వైఖరికి నిరసనగా ఎల్లుండి ధర్నా

కేంద్రం వైఖరికి నిరసనగా ఎల్లుండి ధర్నా

Purchase Of Paddy Grain  :

వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తోందని తెరాస అధినేత కెసిఆర్ ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బఫర్ స్టాక్ చేసే బాధ్యత కేంద్రంపై ఉంది. కేంద్రం రాష్ట్రానికి, ప్రాంతాలకు ఒక నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. తెలంగాణభవన్ లో ఈ రోజు జరిగిన తెరాస శాసనసభ పక్ష సమావేశంలో కెసిఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత మీడియా తో మాట్లాడుతూ బిజెపి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంజాబ్ లో పూర్తిగా కొంటున్న కేంద్రం తెలంగాణలో కొనుగోలు చేయటం లేదు. దీనిపై ప్రశ్నిస్తే జవాబు ఇవ్వటం లేదు. పంట సాగు కొనుగోలుపై కేంద్ర మంత్రిని కలిసినా నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. ఐదారు రోజుల్లో సమాచారం ఇస్తామని ఏమి చెప్పలేదు. 50 రోజులు అయింది ఇప్పటివరకు సమాధానం లేదు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా ఉందని ప్రత్యామ్నాయాలు చేపట్టాలని మన వ్యవసాయ మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. 62 లక్షల ఎకరాల్లో సాగు అయిందని కేంద్రానికి చెప్పాను. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వరి వేయండని రెచ్చగొడుతున్నాడని కేంద్రమంత్రికి చెప్పాను. వర్షాకాలం కొంటాము, ఏసంగి మాత్రం కొనమని రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతాంగానికి ఇప్పటికే చెప్పాము.

కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్ళిన బిజెపి నేతలను రైతులు ఏసంగి పంట కొనుగోలుపై ప్రశ్నిస్తే వారి మనుషులతో దాడి చేయించారు. ఏసంగిలో వారి వేయమని చెప్పింది నిజమా కాదా జవాబు ఇవ్వాలి. ఏసంగి పంట కేంద్రం  కొంటుంద లేదా చెప్పాలి.

ఉత్తరప్రదేశ్ లో రైతుల మీద కార్లు ఎక్కించి చంపారు. ఉత్తరాది ఆందోళనల్లో ఇప్పటికే ఆరు వందల మంది రైతులు చనిపోయారు. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద తెరాస కార్యకర్తలు ఉన్నారని బండి సంజయ్ అంటాడు. తెరాస కార్యకర్తల్లో రైతులు ఉండరా ? మా పార్టీలో 60 లక్షల సబ్యత్వం ఉంది. వరి పండించి అమ్మకాలకు తెరాస కార్యకర్తలు కూడా వస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తే జవాబు ఇవ్వకుండా దాడులు చేయిస్తారా? ఎందుకు దాడులు చేస్తున్నారు?

ఈ నెలలో నారుమల్లు పోస్తారు అందుకని దీనిపై నిర్ణయం తీసుకోవాలని రేపే నేను ప్రధానమంత్రికి, వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాస్తాను. నీటి పన్ను లేకుండా మేము నీరందిస్తున్నాము. దీంతో తెలంగాణలో పంటల స్థిరీకరణ జరుగుతోంది. పంజాబ్ లో కొన్నట్టుగా తెలంగాణలో కొంటారా కొనరా కేంద్రం సూటిగా చెప్పాలి.

ఈనెల 18వ తేదిన వరి కొనుగోళ్ల డిమాండ్ తో హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద TRS మహధర్నా చేపడుతుంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, తెరాస ప్రజాప్రతినిధులు, రైతులు, ఉ. 11 గం. ల నుండి మ. 2 గం. వరకు ధర్నా జరుగుతుంది. అనంతరం గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వనున్న తెరాస పార్టీ శ్రేణులు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు మేము కేంద్రంతో పోరాటం చేస్తాం. 18 వ తేది తర్వాత ఏ పంటలు వేయాలో ప్రకటన చేస్తాం. ధాన్యం కొనుగోలు కోసం ఒత్తిడి చేస్తాం అయితే రైతులు నష్టపోవద్దు కనుక పంట మార్పిడి కోసం కార్యాచరణ ప్రకటిస్తాం. తెలంగాణ నుంచి ఎంత పంట కొనుగోలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం చెప్పే వరకు తెరాస పార్టీ వెంటాడుతుంది. స్పష్టమైన వైఖరి వెల్లడించే వరకు కేంద్రాన్ని వేటాడుతాం అందులో ఎలాంటి అనుమానం లేదు.

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే శాసనసభలో తీర్మానం కూడా చేశాం. వ్యవసాయ చట్టాలకు కూడా మేము వ్యతిరేకం.  రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వటంలో దేశంలో తెలంగాణలోనే ఉత్తమమైన విధానం ఉంది.

Also Read :  కేంద్రం సమాఖ్య స్పూర్తి చూపాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్