Tuesday, January 21, 2025
HomeTrending NewsAsifabad: ధరణి పోతే కష్టాలే - సిఎం కెసిఆర్

Asifabad: ధరణి పోతే కష్టాలే – సిఎం కెసిఆర్

ధరణి పోతే మళ్ళీ లంచాలు, కార్యాలయాల చుట్టూ తిరిగే రోజు వస్తుందని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు  అన్నారు. ధరణి రద్దు చేస్తామని విపక్షాలు అంటున్నాయని… అదే జరిగితే సామాన్యులు ఇబ్బంది పడుతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని కెసిఆర్ అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆసిఫాబాద్‌ చేరుకున్న సిఎం కేసీఆర్‌ జిల్లా కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తాలో గోండు వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అయిన కుమ్రంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. కుమ్రంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
బీఆర్ఎస్ పార్టీ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపిన అధినేత సీఎం కేసీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి చిల్డ్రెన్ పార్క్ కు చేరుకుని మాజీమంత్రి కొట్నక్ భీం రావ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆఫీస్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన తర్వాత కుమురంభీం ఆసిఫాబాద్ నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రారంభించారు. అనంతరం, నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పోడు భూముల పట్టాలను లబ్ధిదారులకు లాంఛనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎవరితో సంబంధం లేకుండా రైతు బందు – బిసీ బంధు అన్ని పథకాల నిధులు బ్యాంకులలో జమ అవుతోందని కెసిఆర్ వెల్లడించారు. తెలంగాణ వచ్చాక గ్రామాల అభివృద్ధి రుపురేఖలె మారాయి. దేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చినా తెలంగాణకు దక్కుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని సిఎం కెసిఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. జల్ జంగల్ జమీన్ నినాదానికి అనుగుణంగా పోడు పట్టాల పంపిణీ ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్