Saturday, November 23, 2024
HomeTrending Newsత్వరలోనే చేనేత వర్గానికి శుభవార్త

త్వరలోనే చేనేత వర్గానికి శుభవార్త

ఉద్యమ సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులను పార్టీ తరపున ఆదుకున్నామని, చేనేత బీమా పథకం రెండు ,మూడు నెలల్లో మొదలవుతుందని ముఖ్యమంత్రి  కెసిఆర్ వెల్లడించారు. చేనేత రంగం కష్టాలు తనకు తెలుసు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారానికి ఎల్‌.రమణ పార్టీలో చేరారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ తెలిపారు. తెరాసలో చేరిన ఎల్‌. రమణకు కేసీఆర్‌ హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. తెరాసలో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణతో తీరిందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. తెరాస పథకాలు ప్రతి గ్రామంలో ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు అవకాశం ఇచ్చారని కేసీఆర్‌ పేర్కొన్నారు.

రమణ 25 యేండ్లుగా వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడని, ఏ పార్టీ లో ఉన్నా సిద్ధాంతాలకు కట్టుబడిన నేత అని కెసిఆర్ ప్రశంసించారు. ఇలాంటి వారు రాజకీయ పార్టీ లకు కావాలి.

తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలకనుగుణంగా పని చేస్తోందని, 40 ఎకరాలు అమ్మితే 2వేల కోట్లు వచ్చాయని సిఎం వెల్లడించారు. కబ్జాలకు గురయ్యే అవకాశాలున్న చోటే భూములు  అమ్ముతున్నామని కెసిఆర్ స్పష్టం చేశారు. భూములు అమ్మిన డబ్బులు పేదల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తాం. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందని, కొందరు సన్నాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక జీతాలు  పొందుతున్నారని కెసిఆర్ పేర్కొన్నారు.

మారుతున్న పరిస్థితులకనుగుణంగా నేత కార్మికుల మారిన నేపధ్యాన్ని గమనించి నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ చెప్పారు. త్వరలోనే చేనేత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తాం. తొందరలోనే చేనేత వర్గ ప్రజలు శుభ వార్త వింటారని, చేనేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కావాలని కెసిఆర్ అన్నారు. చేనేత సామాజిక వర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. రమణ రూపంలో మంచి రాజకీయ నాయకుడిని చూస్తారు. .త్వరలోనే రమణకు మంచి పదవి ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. అవకాశం చిక్కినప్పుడల్లా పద్మశాలీలకు సముచిత స్థానం కల్పిస్తున్నాం. గుండు సుధారాణి కి వరంగల్ మేయర్ గా అవకాశమిచ్చామని, పదవి విరమణ చేసిన ఐ.ఏ.ఎస్ అధికారి పార్థసారధిని ఎన్నికల కమిషనర్ గా నియమించామని సిఎం గుర్తు చేశారు. కొందరు సన్నాసులు ఉద్యమంలో విమర్శించారు. ఇపుడు అదే పని చేస్తున్నారని కెసిఆర్ మంది పడ్డారు.

తెలంగాణ కోసం అందరూ కాడి కిందపెట్టినపుడు నేను ఒక్కడిగా జెండా ఎత్తాను. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఒంటరిగా బయలుదేరాడని, ఒకపుడు తెలంగాణ లో వ్యవసాయ రంగం నుంచి 16 వేల కోట్ల రూపాయలు gsdp గా లభిస్తే అదిప్పుడు 50 వేల కోట్లకు చేరిందని కెసిఆర్ వివరించారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఒకపుడు తెలంగాణ లో తలసరి విద్యుత్ వినియోగం 1070 యూనిట్లు ఉంటె ఇపుడు 2170 యూనిట్ల కు చేరిందన్నారు. కరెంటు లో అట్టడుగున ఉన్న తెలంగాణ ఇపుడు అగ్రభాగానికి చేరిందన్నారు. ధరణి  ఒక విప్లవమని, దీంతో రైతుల బాధలు తొలగిపోయాయని సిఎం చెప్పారు.

తప్పులు చేసే అధికారం మాకు లేదు. అధికారాన్ని తెలంగాణ కోసం సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయొద్దన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆరు నెలల ముందే మిషన్ కాకతీయ కార్యక్రమం ఆలోచన చేసామన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణను 100శాతం నెరవేరుస్తానని, ప్రజలు కలగన్న తెలంగాణ తప్ప తనకు వేరే పనిలేదని కెసిఆర్ తేల్చి చెప్పారు. నా లైన్ ను ఎవ్వరూ మార్చలేరు. నాకు ఈ వయసు లో తెలంగాణ ధ్యాస తప్ప మరొకటి లేదు. నేను కలలు కన్న రీతిలో తెలంగాణ అభివృద్ధి అయ్యేదాకా విశ్రమించనని ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్