Thursday, February 20, 2025
HomeTrending Newsఎల్లుండి వరంగల్ జిల్లాకు కెసిఆర్

ఎల్లుండి వరంగల్ జిల్లాకు కెసిఆర్

KCR Tour In Warangal District :

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 10 వ తేదీ, బుధవారం నాడు (ఎల్లుండి) వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా, జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణ, అభివృద్ధికి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే వోవర్ బ్రిడ్జి ( ఆర్ వో బి) ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపి, సిఎం కెసిఆర్ మంజూరు చేయన్నారు.
వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై., వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సిఎం సమీక్షించనున్నారు. హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ అదే రోజు ప్రారంభించనున్నారు.


ఇవి కూడా చదవండి:  

నవంబర్ 29న విజయ గర్జన సభ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్