Thursday, March 12, 2026
HomeTrending Newsదేశానికే ఆదర్శం : కేసియార్

దేశానికే ఆదర్శం : కేసియార్

నేడు (జూన్ 2) తెలంగాణా అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం కేసియార్ శుభాకాంక్షలు తెలియజేశారు. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని కెసియార్ గుర్తు చేశారు. దేశం అబ్బురపడే రీతిలో రాష్ట్రాన్ని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు  అన్న నాటి ఉద్యమ నినాదాలను స్వరాష్ట్రంలో ఒక్కోటిగా అమలు చేస్తున్నామని అన్నారు.

‘అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంత వరకు విశ్రమించను’ అని తన సందేశంలో కేసీఆర్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular