Sunday, January 19, 2025
HomeTrending Newsమిషన్ కెసిఆర్ ఓటమి - ఈటెల రాజేందర్

మిషన్ కెసిఆర్ ఓటమి – ఈటెల రాజేందర్

 Kcrs Defeat : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను మంచి మిత్రులమని మోదీ పాలనలోనే దేశం ముందుకు పోతుందని బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కూడా రాజగోపాల్ ప్రకటన చేశారని ఈటెల రాజేందర్ గెలిస్తేనే ధర్మం గెలిచినట్టు, ప్రజాస్వామ్యం గెలిచినట్టు అని. ఈరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వస్తారని ఆశిస్తున్నాను. ఆయన భారతీయ జనతా పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు.

హుజురాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ రోజు బిజెపి చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ  బ్రహ్మదేవుడు కూడా టిఆర్ఎస్ను కాపాడలేడని వాస్తవాన్ని చూడలేని కబోదులు టిఆర్ఎస్ నాయకులని రాజేందర్ విరుచుకుపడ్డారు. దాడి చేసుడు, పైసలు ఇచ్చి ప్రలోభ పెట్టుడు, పదవులు ఇస్తాను అని ప్రలోభ పెట్టుడు కెసిఆర్ నైజం అన్నారు. ఎంతమందిని బెదిరిస్తారు.. ఎంతమందికి పదవులు ఇస్తారు.. ఇంకో సంవత్సరం ఉంది కాబట్టి బిల్లులు రావాలి అని ఆగుతున్నాము.. అన్నీ వచ్చిన తర్వాత బయటపడతాము అని వందల మంది సర్పంచులు, ఎంపీటీసీలు తనతో చెప్తున్నారని ఈటెల రాజేందర్ వెల్లడించారు.

నేను గజ్వేల్లో పోటీ చేస్తాను అని ఛాలెంజ్ చేశాను.  హుజురాబాద్ ఎన్నికల సమయంలో శిఖండిలాగా వేరే వాళ్లను ఎందుకు ముందు పెడతావు నువ్వు వస్తావా ? మీ అల్లుడు వస్తారా ? వచ్చి పోటీ చేయండి అని సవాలు విసిరినా స్పందన లేదని ఈటెల రాజేందర్ విమర్శించారు.  ఆరోజు ఎన్నికల్లోనే హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కి మధ్య పోటీ అని చెప్పి ప్రచారం చేసి గెలిచిన. గెలిచిన తర్వాత ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటిస్తుందా ? కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తే కూడా పిలుపు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా నా హక్కులకు, నా ప్రోటోకాల్ కు భంగం కలిగించలేదని, గత తొమ్మిది నెలలుగా ఏ శంకుస్థాపన చేసిన ఆ శిలాఫలకం మీద నా పేరు లేదన్నారు. నేను గతంలో తెచ్చిన నిధులను పేరు మార్చి కొత్తగా శిలాఫలకాలు వేసుకుంటున్నారని మండిపడ్డారు.

నా జీవితంలో కేసీఆర్ని ఓడించకపోతే జీవితంకు సార్థకత లేదని… గజ్వేల్ లో పోటీ చేస్తా అని చెప్పిన. నా పోరాటం ఇక్కడ ఉన్న వారితో కాదు కేసీఆర్ తో.. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని మాజీ మంత్రి ఈటెల అన్నారు. హుజురాబాద్లో పోటీ చేసిన పర్లేదు, గజ్వేల్ ల్లో పోటీచేసిన పర్లేదు అని కేసీఆర్ కి మరోసారి సవాలు  చేశారు. ఆప్షన్ నీకే వదిలేస్తున్నా.ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు విర్రవీగ వద్దు కేసీఆర్ అన్నారు.

నేను గెలిచిన తరువాత 9 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరంగా హుజురాబాద్ కోసం ఒక జీవో కూడా విడుదల చేయలేదని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో డిఎంఎఫ్టీ కింద, మున్సిపాలిటీ కింద నేను తెచ్చిన నిధులు తప్ప ఒక్క రూపాయి కొత్తగా రాలేదు. అవగాహన లేనివారు మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి. నా లక్ష్యం ఇప్పుడు కేసీఆర్ ఓడగొట్టే మిషన్ అన్నారు.

Also Read ప్రభుత్వానికి ఈటల రాజేందర్ వార్నింగ్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్