Tuesday, March 17, 2026
Homeసినిమాచిరు మూవీలో కీర్తి సురేష్‌.

చిరు మూవీలో కీర్తి సురేష్‌.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్, వేదాళం రీమేక్ లో నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందే ‘లూసీఫర్’ రీమేక్ ను ఆగష్టు 13న ప్రారంభించనున్నారని సమాచారం. ఇక మెహర్ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ను అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నారు.

అయితే.. వేదాళం రీమేక్ లో చిరంజీవి సిస్టర్ రోల్ లో కీర్తి సురేష్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్‌.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. పరశురామ్ తెరకెక్కిస్తోన్న సర్కారు వారి పాట సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. తెలుగులో కీర్తి సురేష్ తదుపరి చిత్రం ఎవరితో అనేది అఫిషియల్ గా ప్రకటించలేదు. అయితే.. చిరంజీవి వేదాళం రీమేక్ లో సిస్టర్ రోల్ లో నటించేందుకు కీర్తి సురేష్‌ ఓకే చెప్పిందని సమాచారం. ముందుగా సాయిపల్లవిని అనుకున్నారు కానీ.. ఫైనల్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular