Saturday, March 14, 2026
Homeసినిమా‘గుడ్ లక్ సఖి’ నుంచి ‘బ్యాడ్ లక్ సఖి’ సాంగ్ రిలీజ్

‘గుడ్ లక్ సఖి’ నుంచి ‘బ్యాడ్ లక్ సఖి’ సాంగ్ రిలీజ్

Keerthi Suresh Sakhi  Releasing On November 26th

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం నుంచి బ్యాడ్ లక్ సఖి అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ మంచి బాణీని సమకూర్చగా.. శ్రీమణి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

హరిప్రియ, సమీర భరద్వాజ్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో సఖి వల్ల ఊరికి ఎంత బ్యాడ్ జరిగిందో, ఆమె శకునం ఎలాంటిదో ఎంతో సరదాగా చూపించారు. ఈ స్పోర్ట్స్ రామ్‌ కామ్ సినిమాలో కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయిగా ఎంతో చక్కగా నటించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. నవంబర్ 26న ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read : నవంబర్ 26న కీర్తి సురేష్ ‘గుడ్‌ల‌క్ స‌ఖి’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular