Tuesday, September 17, 2024
Homeసినిమానేనే 'కళావతి'ని కావడం నా అదృష్టం: కీర్తి సురేశ్  

నేనే ‘కళావతి’ని కావడం నా అదృష్టం: కీర్తి సురేశ్  

Kalavathi: టాలీవుడ్లో టాప్ త్రీ హీరోయిన్స్ లో కీర్తి సురేశ్ ఒకరు. ఎలాంటి స్కిన్ షో చేయకుండా చాలా తక్కువ సినిమాలతో .. తక్కువ కాలంలో ఆమె ఈ పొజిషన్ కి చేరుకుంది. అందం .. అభినయం రెండూ కీర్తి సురేశ్ సొంతం. అందువలన ఇటు దర్శక నిర్మాతలు .. అటు యంగ్ స్టార్ హీరోలు తమ సినిమాల్లోకి ఆమెను తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నారు. అయితే ‘మహానటి’ తరువాత తెలుగులో ఆ స్థాయి హిట్ ను కీర్తి సురేశ్ సొంతం చేసుకోలేకపోయింది.

కీర్తి సురేశ్ తాజా చిత్రంగా ‘ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘సర్కారువారి పాట’ సిద్ధమవుతోంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. “ఈ కథ వినగానే నాకు నచ్చేసింది. అవసరమైతే మిగతా సినిమాలను పక్కన పెట్టేసి ముందుగా ఈ ప్రాజెక్టు చేద్దామని అనుకున్నాను. షూటింగ్ అంతా కూడా చాలా సరదాగా గడిచిపోయింది. నేను తనతో సమానంగా డాన్స్  చేయలేకపోయినప్పుడు మహేశ్ టీజ్ చేసేవారు .. సెటైర్లు వేసేవారు.

ఈ సినిమాలో ‘కళావతి’ సాంగ్ విన్న రోజునే నేను చెప్పాను .. ఇది సూపర్ హిట్ అవుతుందని. అన్నట్టుగానే ఈ పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది. 150 మిలియన్స్ కి పైగా వ్యూస్ అంటే సామాన్యమైన విషయమేం కాదు. నేను కూడా భాగమైన పాటకి ఇన్ని వ్యూస్ రావడం  .. ఆ పాటలోని ‘ కళావతి’ని నేనే కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సాంగ్ లో కనిపించడమే గర్వకారణంగా భావిస్తూ ఉంటాను” అని చెప్పుకొచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్