Thursday, March 19, 2026
Homeసినిమామళ్లీ అదే రూట్లో వెళుతున్న కీర్తి సురేశ్! 

మళ్లీ అదే రూట్లో వెళుతున్న కీర్తి సురేశ్! 

కీర్తి సురేశ్ బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చింది. అందువలన ఎలాంటి కథలను ఒప్పుకోవాలి? ఎటువంటి పాత్రలను ఎంచుకోవాలి? అనే విషయంలో ఆమెకి బయటివారు చెప్పవలసిన అవసరం లేదు. ఇక హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది గనుక, ఏ తరహా సినిమాలు చేయాలనే విషయాన్ని ఇంట్లోవారు కూడా ఆమెకి చెప్పవలసిన పనేలేదు. ఎందుకంటే ఈ పాటికే ఆమెకి అర్థమై ఉండాలి.

కానీ కీర్తి సురేశ్ తీరు చూస్తుంటే మాత్రం ఆమె ప్లానింగ్ తేడా కొట్టేస్తోంది అనే విషయం అర్థమవుతోంది. ‘మహానటి’ ఘనవిజయం అనంతరం ఆమె తెలుగు వైవు చూడకుండా వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళ్లి, తెలుగు ఆడియన్స్ తో గ్యాప్ వచ్చేలా చేసుకుంది. ఇక లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుని అవి కూడా ‘మహానటి’లా ఆడతాయని భావించింది. అలా తెలుగులో చేసిన సినిమాలు కూడా ఆమెను నిరాశపరిచాయి.

‘సర్కారువారి పాట’ హిట్ తరువాతనైనా ఆమె తెలుగు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెడుతుందని అనుకుంటే, ఇప్పుడు తమిళంలోనే నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ‘భోళా శంకర్’ లో చేస్తున్న చెల్లెలి పాత్రను పక్కన పెడితే, ‘దసరా’ మాత్రమే హీరోయిన్ గా ఆమె చేతిలో ఉన్న సినిమా. ఇక మళ్లీ ఆమె ‘రివాల్వర్ రీటా’ అనే నాయిక ప్రధానమైన సినిమా కూడా చేస్తోంది. తెలుగులో ఒక హిట్ పడగానే వరుస తమిళ సినిమాలు చేయడం .. టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న ఆమె, చెల్లెలి పాత్రలు చేయడం .. ఫ్లాపులు ఎదురైనా నాయిక ప్రధానమైన కథలకు ఓకే చెబుతూ, కీర్తి మళ్లీ అదే పొరపాటు చేస్తుందేమోననేది అభిమానుల అభిప్రాయం.

Also Read : కీర్తి సురేశ్ కాస్త స్పీడ్ పెంచవలసిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular