Sunday, January 19, 2025
Homeసినిమాకీర్తి సురేశ్ ను ఇంతవరకూ ఇలా ఎవరూ చూపించలేదే! 

కీర్తి సురేశ్ ను ఇంతవరకూ ఇలా ఎవరూ చూపించలేదే! 

Keerthy Show: కీర్తి సురేశ్ తన కెరియర్ ఆరంభంలో ‘నేను శైలజ’ .. ‘నేను లోకల్’ వంటి సినిమాలు చేరేసింది. ఆ సినిమాల్లో ఆమె హీరోతో కలిసి ఆడిపాడేసింది. కానీ ఆమె పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం ‘మహానటి’ సినిమా మాత్రమే . ఆ సినిమా చూసైనా వాళ్లంతా ఆమె యాక్టింగ్ స్కిల్స్ చూసి షాక్ అయ్యారు. హీరోతో కలిసి అల్లరి చేస్తూ .. ఆడిపాడే ఈ అమ్మాయిలో  ఇంత విషయం ఉందా? అని అంతా ఆశ్చర్యపోయారు. ఇక ‘మహానటి’ వంటి నిండు దానం .. నిబ్బరం కలిగిన పాత్రలనే ఈ అమ్మాయి బాగా చేయగలదని ఫిక్స్ అయ్యారు.

అలా అనుకుంటున్నవారికి కీర్తి సురేశ్ మరోసారి షాక్ ఇచ్చింది. ‘సర్కారువారి పాట‘ సినిమాలో ఆమె చాలా అమాయకంగా ..  ముద్దుగా .. ముద్దబంతి పువ్వులా కనిపిస్తుందని అభిమానులు భావించారు. మహేశ్ మనసు నిప్పించకుండా ప్రేమిస్తుందనీ .. ఆయనతో  పాటు సున్నితమైన స్టెప్స్  వేస్తుందని అనుకున్నారు. అప్పటికీ ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా కనిపిస్తుందనీ ..  ఆ తరహా యాక్టింగ్ ను ఆమె ఇరగదీసేసిందని మహేశ్ బాబు పలు ఇంటర్వ్యూల్లో చెబుతూనే వచ్చాడు.

తీరా ఈ సినిమా చూసిన తరువాత ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ సుకుమారిలో మాస్  కంటెంట్ ఇంతుందా? అని నివ్వెరపోయి .. నిర్ఘాంతపోయి .. కొయ్యబారిపోయారు. అంతగా ఆమె తనలోని మాస్ యాంగిల్ చూపించింది. ఒకానొక దశలో మహేశ్ ను బూతులు కూడా తిట్టేస్తుంది. ఇలాంటి ఒక పాత్రను కీర్తి సురేశ్ ఇంత ఈజ్ తో చేరుస్తుంది ఎవరూ అనుకోలేదు. డాన్సుల విషయంలోను మహేశ్ కి తగిన జోడీగా ఇన్నేసి మార్కులు కొట్టేస్తుందని ఊహించలేదు. ఈ తరహా పాత్రల్లో కీర్తి సురేశ్ హవా మొదలవడం ఖాయమేననే టాక్ మాత్రం ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది.

Also Read : సర్కారువారి పాట సక్సెస్ కోసమే కీర్తి సురేశ్ వెయిటింగ్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్