Saturday, January 18, 2025
Homeసినిమాకీర్తి సురేశ్ కి మహనటి' తరువాత 'దసరా'నే! 

కీర్తి సురేశ్ కి మహనటి’ తరువాత ‘దసరా’నే! 

సౌత్ లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి మార్కులు కొట్టేసి, ఆ తరువాత హీరోయిన్ గా స్టార్ డమ్ అందుకున్న కథానాయికలలో కీర్తి సురేశ్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళ సినిమాలతో తన కెరియర్ ను మొదలెట్టిన కీర్తి సురేశ్, హీరోయిన్ గా తమిళ .. తెలుగు సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తెలుగులో ‘మహానటి’ కోసం కీర్తిని ఎంపిక చేసినప్పుడు, ‘సావిత్రి నటన గురించి తెలిసే ఈ అమ్మాయి ఈ సినిమాను ఒప్పుకుందా?” అనే కామెంట్లు వినిపించాయి.

‘మహానటి’ సినిమా విడుదల తరువాత అలాంటి కామెంట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ పాత్రను కీర్తి తప్ప అంత బాగా ఎవరూ చేయలేరేమోనని అంతా అనుకున్నారు. అంతగా ఆమె ఆ పాత్రలో జీవించింది. ఇక నాయక ప్రధానమైన పాత్రలకు మరో మంచి ఆర్టిస్ట్ దొరికిందనే భరోసా మేకర్స్ కి వచ్చేసింది. ‘మహానటి’ తరువాత తెలుగులో ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది .. కానీ నటన పరంగా ఆమెకి ఆ స్థాయి క్రేజ్ మాత్రం లభించలేదు.

కీర్తి సురేశ్ ‘సర్కారువారి పాట’లో చేసినప్పటికీ, అది ఆశించిన స్థాయి హిట్ ను అందుకోలేకపోయిందనే టాక్ ఉంది. ఈ సమయంలోనే ఆమె సీనియర్ స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడటంతో అభిమానులు కంగారుపడ్డారు. అయినా కీర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే ‘దసరా’ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేసింది. ఈ సినిమాలో ఆమె నటన అక్కడక్కడ ‘మహానటి’ని మరిపిస్తుందని ప్రమోషన్స్ లో నాని అన్నాడు. ఈ సినిమా చూసిన తరువాత అది నిజమేనని అనిపించక మానదు. అటు నటన  పరంగా .. ఇటు వసూళ్ల పరంగా ఆమెకి ఇది ‘మహానటి’ తరువాత స్థానాన్ని ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : Keerthy Suresh: హీరో ఊర మాస్ .. హీరోయిన్ పక్కా మాస్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్