Saturday, January 18, 2025
Homeసినిమాఆ హీరోతో కలిసి నటించాలని ఉంది: కీర్తి సురేశ్ 

ఆ హీరోతో కలిసి నటించాలని ఉంది: కీర్తి సురేశ్ 

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. శ్రీదేవి .. మీనా మాదిరిగానే చైల్డ్ ఆర్టిస్టుగా తెరపైకి వచ్చిన కీర్తి సురేశ్, ఇప్పుడు హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలను .. భారీ విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో నేను శైలజ .. నేను లోకల్ .. మహానటి .. దసరా వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె వరుస తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవల కీర్తి సురేశ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ శింబూ గురించి ప్రస్తావించింది. ఆయనతో ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడానని చెప్పింది. ఆయన యాక్టింగ్ స్టైల్ అంటే తనకి చాలా ఇష్టమనీ, ఆయనతో కలిసి నటించాలని ఉందని అంది. శింబూకి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను మంచి ఫాలోయింగ్ ఉందనీ, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాని చెప్పింది.

శింబూ తెరపై మాత్రమే కాదు, బయట కూడా కాస్త దూకుడుగా ఉండే హీరోనే. కథ .. స్క్రీన్ ప్లే .. సినిమా సంగీతం .. సాహిత్యంపై ఆయనకి మంచి పట్టుంది. పాటలు కూడా బాగానే పాడతాడు. ఆయనతో కలిసి నటించాలంటే కొంతమంది హీరోయిన్స్ ఆలోచన చేస్తారు. అలాంటిది అతనితో కలిసి నటించాలని ఉందని కీర్తి సురేశ్ చెప్పడం విశేషమే. మరి వీరి కాంబినేషన్ కి తగిన కథను పట్టుకుని ఏ దర్శకుడు వస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్