Monday, March 16, 2026
Homeసినిమాకేతిక ఉంది .. కానీ రొమాన్స్ లేదే!

కేతిక ఉంది .. కానీ రొమాన్స్ లేదే!

కేతిక శర్మ  ఓ సాదా సీదా హీరోయిన్ గా తెరపైకి రాలేదు. హాట్ బ్యూటీగానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఫస్టు మూవీనే ‘రొమాంటిక్’ .. పూరి పరిచయం చేసిన అమ్మాయి. ఆ సినిమా పోస్టర్స్ ద్వారానే ఆమె చాలామంది కుర్రాళ్లను లాక్కొచ్చి తన అభిమానుల జాబితాలో పడేసింది. ఇక అందులో నుంచి బయటికి రాలేక వాళ్లంతా అక్కడే గడిపేస్తున్నారు. అంత హాట్ లుక్స్ తో ఆమె యూత్ ను తనవైపుకు తిప్పుకుంది. అందాల ప్రదర్శనకి అడ్డు చెప్పని ఈ సుందరిని అవకాశాలు ముంచెత్తడం ఖాయమని అంతా అనుకున్నారు గానీ అలా జరగలేదు.

ఫస్టు సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ఎందుకు కాలేదనే విషయాన్ని అలా ఉంచితే, గ్లామర్ పరంగా కేతికకి ఫుల్ మార్కులు పడిపోయాయి. అందువలన ఇక తెరపైకి ఈ అమ్మాయి తరచూ వస్తూనే ఉంటుందని అనుకున్నారు .. ఓ రెండు సినిమాల వరకూ అలాగే జరిగింది కూడా. అయితే ఆ సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఆమె కెరియర్ ఇబ్బందుల్లో పడింది. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో ఆమె రొమాన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘లక్ష్య’ సినిమాలో ఆమె గ్లామర్ ను పెద్దగా పట్టించుకోలేదు.

నిన్న థియేటర్లకు వచ్చిన ‘బ్రో’ విషయంలోను ఇదే జరిగింది. కేతిక ఉందనగానే .. సాయితేజ్ జోడీ ఆమెనే అనగానే కుర్రాళ్లు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అందాల సందడి ఒక రేంజ్ లో ఉండొచ్చని ఊహించుకున్నారు. కానీ ఆమెతో రొమాన్స్ కి ‘బ్రో’ సమయాన్ని కేటాయించకపోవడంతో డీలాపడిపోయారు. ఐ లవ్ యూ .. ఐ హేట్ యూ చెప్పడానికి కేతిక ఎందుకూ అనుకున్నారు. ఇలాంటి ఒక సినిమాలో ఆమె పాత్ర వైపు నుంచి రావలసిన అవుట్ పుట్ ఆడియన్స్ కి రాలేదు. అందువలన ఈ సినిమా వలన ఆమె కెరియర్ కి కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చునేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular