Thursday, September 19, 2024
Homeసినిమామెగా హీరో జోడీగా ఢిల్లీ బ్యూటీ!

మెగా హీరో జోడీగా ఢిల్లీ బ్యూటీ!

కేతిక శర్మ .. పేరు వినగానే ఫస్టు సినిమా అయిన ‘రొమాంటిక్’ లోనే అందాల రచ్చ చేసిన కథానాయికగా యూత్ కి బాగా గుర్తుండిపోయింది. అయితే ఆమె అందాలకి సరైన కథాకథనాలు తోడు కాకపోవడంతో ఆ సినిమా దెబ్బకొట్టేసింది. ఆ తరువాత ఆమె నాగశౌర్య సరసన ‘లక్ష్య’ .. ‘వైష్ణవ్ తేజ్ జోడీగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాలు చేసింది. అయితే ఈ రెండు సినిమాల కంటే కూడా ఫస్టు సినిమానే కాస్త బెటర్ అనిపించుకుంది.

ఇప్పుడున్న ట్రెండులో ఒక సినిమాలో హీరోయిన్ పాత్రకి ఉండే ప్రాధాన్యత చాలా తక్కువ. అయినా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ ఎక్కువగా హీరోయిన్స్ కెరియర్ పై పడుతుంది. అలాంటిది కేతిక మూడు ఫ్లాపులను వరుసగా అందుకుంది. నిజం చెప్పాలంటే కేతికను తీసుకునేదే గ్లామర్ కోసం. అలాంటి  గ్లామర్ ను తన నుంచి ఆవిష్కరించడంలో ఆమె ఏ సినిమాలోను విఫలం కాలేదు. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు.

ఈ ఢిల్లీ బ్యూటీ అవకాశాల కోసం వెయిట్ చేస్తూ, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే ఉంటోంది. తన హాట్ ఫోటోలను ఒక రేంజ్ లో వదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు సాయితేజ్ జోడీగా ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ‘వినోదయ సీతం’ను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ ప్రధానమైన పాత్రను పోషించనున్న ఈ సినిమాలో, సాయితేజ్ జోడీగా కేతిక ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్