Saturday, March 14, 2026
HomeTrending Newsవైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు: సిఎం జగన్

వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు: సిఎం జగన్

సెప్టెంబరు 5 నాటికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 754  ప్రొసీజర్లను చేరుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వీటితో మొత్తంగా 3118 చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పార్వతీపురం జిల్లాలోనూ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖలో మరికొన్ని కీలక సంస్కరణలకు తీసుకురావాలని, జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన కార్యకలాపాలు అన్నీ అదే జిల్లాకు చెందిన వైద్యకళాశాల నేతృత్వంలో జరగాలని సూచించారు. డీఎంఅండ్‌ హెచ్‌ఓ కార్యకలాపాలుకూడా జిల్లా మెడికల్‌కాలేజీలోనే ఉండాలని నిర్దేశించారు.

మొత్తంలో జిల్లాలో ఉండే అన్నిరకాల ఆస్పత్రులు, క్లినిక్స్‌ కు సంబంధించిన వైద్య సంబంధిత కార్యకలాపాలు, పరిపాలనా కార్యకలాపాలు అన్నీ కూడా మెడికల్‌కాలేజీ నేతృత్వంలోనే ఉండాలన్నారు. ఎవరు ఏంచేయాలి? ఎవరి విధులు ఏంటి? ఎవరి బాధ్యతలు ఏంటి? అన్నదానిపై పకడ్బందీగా ఎస్‌ఓపీ తయారుచేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

సమీక్ష సందర్భంగా సిఎం సూచనలు:

  • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ను సమర్థవంతంగా అమలు చేయాలి
  • దీనికోసం మూడు అంశాలపై దృష్టిపెట్టాలి, విలేజ్‌ క్లినిక్, పీహెచ్‌సీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
  • దీనితర్వాత పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలి
  • అవసరమైన అంబులెన్స్‌ లను అందుబాటులో ఉంచాలి
  • ఒక ప్రత్యేక అధికారిని నియమించుకుని ఈ పనులు ఎలా ముందుకు సాగుతున్నాయన్నదానిపై ప్రతిరోజూ సమీక్ష, పరిశీలన చేయాలి

  • వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లపైనా సమీక్ష.
  • ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారు
  • అంటే ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో 3 నుంచి 4 గురు సిబ్బంది ఉంటారు
  • మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌గా పిలవాలి
  • విలేజ్‌ క్లినిక్స్‌ లో 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయి
  • 14 రకాల పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయి
  • 6956 టెలీమెడిసన్‌ స్పోక్స్, 27 హబ్స్‌ ఏర్పాటు
  • మెడికల్‌ హబ్స్‌ ను అన్ని జిల్లాల వైద్యకళాశాలల్లో ఏర్పాటు చేయాలి
  • జిల్లా వైద్య కళాశాల నేతృత్వంలోనే ఇవి పనిచేయాలి
  • ఈ మెడికల్‌ హబ్స్‌ నుంచి చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలి

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీ వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌)  రవిశంకర్, డాక్టర్‌ వైయస్సార్‌ ఏహెచ్‌సీటీ అడిషనల్‌ సీఈఓ ఎంఎన్‌ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular